Home ఆసియా కప్ 2018 ఫేవరేట్ x అఫ్ బీట్

ఫేవరేట్ x అఫ్ బీట్

Asia cup final india vs bangladesh

నేడే ఆసియాకప్ ఫైనల్ 

సాయంత్రం 5.00 గంటల నుంచి ఆరంభం

దుబాయ్: టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు శుక్రవారం ఆసియాకప్ 2018 ఫైనల్‌లో తపడనున్నాయి. ఫేవరేట్ జట్టయిన భారత్ తన ఆధిక్యతను నిలబెట్టుకునేందుకు చూస్తుంటే, అప్‌బీట్ జట్టయిన బంగ్లాదేశ్ అనూహ్య విజయాన్ని సాధించేందుకు కాలుదువ్వుతోంది. పాకిస్థాన్‌ను బుధవారం 37 పరుగుల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ గట్టిపోటీ ఇవడానికే నిశ్చయించుకుంది. ఇంతవరకు ఆసియాకప్ టోర్నమెంట్‌లో ఓటమన్నదే ఎరుగని టీమిండియా రికార్డుస్థాయిలో ఏడోసారి ఘనవిజయం సాధించాలని చూస్తోంది. ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడుతాయనుకుంటే.. అదృష్టంకొద్దీ బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో టీమిండియాకు బంగ్లాదేశ్ జట్టు గట్టిపోటీనిస్తోంది. అయితే బంగ్లా క్రికెట్ జట్టులో గాయాలపాలైన కీలక క్రీడాకారుల ఆడడంలేదు. చేయి విరిగిన స్టార్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ఆడడంలేదు. కాగా ప్రధాన ఆల్‌రౌండర్ షకీబ్ అల్‌హసన్ వేలి గాయం కారణంగా అదే బాటపట్టనున్నాడు. అతడికి శస్త్ర చికిత్స జరగాల్సి ఉన్నందున సెప్టెంబర్ నుంచి జింబాబ్వేతో ఆరంభం కానున్న హోం సిరీస్ కూడా ఆడకపోవచ్చని భావిస్తున్నారు.

భారత జట్టు అనుకూలప్రతికూలతలు మరోలా ఉన్నాయి. టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్, బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఉండే విరాట్ కోహ్లి ఆడడంలేదు. అతడు వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్‌లో కీలకం కానున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్ట్ సిరీస్‌లో 14తేడాతో ఓడిపోయిన టీమిండియాకు ఆసియాకప్ ట్రోఫీ ఊరటకాగలదని భావిస్తున్నారు. అయితే ఈ ఆసియాకప్ ఫైనల్ భారత జట్టుకు ప్రత్యేకమైనది కాగలదనిపిస్తోంది. కోహ్లికి బదులుగా జట్టుకు సారథ్యం వహించనున్న స్టాండ్‌ఇన్ స్కిప్పర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శిఖర్ ధవన్ మళ్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లుగా ఆడనున్నారు. కాగా ్ల జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ తమ బౌలింగ్ పటిమతో ఆకట్టుకోనున్నారు.

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు నిలదొక్కుకుంటారో లేదోనన్న అనుమానస్పద స్థితిలో రోహిత్(269 పరుగులు), శిఖర్ ధవన్(327 పరుగులు) మీదే విజయవకాశాలు ఆధారపడ్డాయి. దుబాయ్‌లోని స్లోట్రాక్‌పై ధోని సైతం పోరాడాల్సి ఉంటుంది. అతడు టీమిండియాలో ఉన్న మరో మేటి బ్యాట్స్‌మన్. బహుశా ధోని నాలుగో బ్యాట్స్‌మన్‌గా ప్రవేశించే అవకాశం ఉంది. దానివల్ల ఆయన ఎక్కువ బంతుల ఆడే అవకాశం కూడా ఉంటుంది. అంబటి రాయుడు ఆడుతున్నప్పటికీ సరైన ఫినిషింగ్ ఇవ్వడంలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌లుగా రోహిత్, అంబటి రాయుడు ఉండకపోవచ్చు.

భారత బ్యాట్స్‌మెన్‌లను తమ బౌలింగ్‌తో కంగుతినిపించేందుకు బంగ్లాదేశ్ జట్టులో ముస్తఫిజుర్ రహ్మాన్, రూబెల్ హుస్సేన్, మష్రఫె ముర్తజా వంటి బౌలర్లున్నారు. ముస్తఫిజుర్ బౌలింగ్ ఎత్తుల్లో దిట్ట. కాగా మష్రఫెకు అనుభవం ఎక్కువ. వారిద్దరూ బంగ్లాదేశ్ జట్టుకు దన్నుగా ఉండనున్నారు. కాగా బంగ్లా జట్టులో షకీబ్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం అనే చెప్పాలి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే వారు ముష్పిఖుర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్‌లపైనే ఆ జట్టు ఎక్కువ ఆధారపడనున్నది. అయితే వారిని జస్ప్రీత్ బుమ్రా చెమటలు పట్టించడం ఖాయమనిపిస్తోంది. అతడికి తోడు కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లు కూడా బంగ్లా జట్టు బ్యాటింగ్‌లైన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలరనిపిస్తోంది.

జట్లు…

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని(వికెట్‌కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యుజ్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మనీశ్ పాండే, సిద్ధార్థ కౌల్, కెఎల్ రాహుల్, దీపక్ చాహర్.

బంగ్లాదేశ్: ముష్రఫె బిన్ ముర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మహ్మద్ మిథున్, లిట్టన్ కుమార్ దాస్, ముషిఖర్ రహీమ్, ఆరిఫుల్ హఖ్, మహ్మదుల్లా, మొసద్దెక్ హుస్సేన్ సైకత్, నజ్ముల్ హుసైన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ ఇస్లాం అపు, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ రహ్మాన్, అబు హైదర్ రోని.