Friday, March 29, 2024

అవినాశ్ రెడ్డిని లొంగిపొమ్మనండి!

- Advertisement -
- Advertisement -
కర్నూలు ఎస్పీని కోరుతున్న సిబిఐ అధికారులు

కర్నూలు: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ వై.ఎస్.అవిశాశ్ రెడ్డి విషయంలో సోమవారం ఉదయం నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఇటీవల అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో ఆమెను కర్నూలు లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా అవినాశ్ రెడ్డి అక్కడే ఉంటున్నారు.

ఈ నెల 22న విచారణకు హాజరుకావాలంటూ సిబిఐ నోటీసులు పంపగా, తాను సోమవారం విచారణకు రాలేనంటూ అధికారులకు ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆసుపత్రి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వైకాపా కార్యకర్తలు అవినాశ్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి తరలివస్తున్నారు.కర్నూలులో సిబిఐ అధికారులు ఎస్పీతో చర్చిస్తున్నారు. అవినాశ్‌ను లొంగిపోవాల్సిందిగా చెప్పాలంటూ ఎస్పీని వారు కోరారు. ఎస్పీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News