Tuesday, January 31, 2023

తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుంటే జీతం కట్!

- Advertisement -

Old-Parents-Childrenడిస్పూర్ : పెంచి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై అస్సాం ప్రభుత్వం కొరడ ఝుళిపించనుంది. వయసుపై బడిన వాళ్ల మంచి, చెడ్డలు చూడని ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి తల్లిదండ్రులకు అందించనుంది. ఈ మేరకు అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా మంగళవారం బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తెస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని.. లేని పక్షంలో ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుని ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి వాళ్ల తల్లిదండ్రులకు అందిస్తుందని ఆయన తెలిపారు. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles