Home ఎడిటోరియల్ అసోం జాతీయ పౌర జాబితా

అసోం జాతీయ పౌర జాబితా

Assam National Citizen List

 

ఎన్‌ఆర్‌సిగా క్లుప్తంగా పిలువబడే జాతీయ పౌర జాబితా తుది ప్రతి విడుదలైంది. చాలా కాలంగా ఎంతో మంది ఎదురు చూసిన జాబితా ఇది. ఇంతకు ముందు 2018 జూన్‌లో కూడా ఒక జాబితా విడుదలైంది. అప్పుడు తలెత్తిన అనేక ప్రశ్నలకు ఇప్పుడు కూడా జవాబు దొరకలేదు. ఇప్పుడు తుది జాబితాలో 19,06,657 మంది పేర్లు లేవు. అంటే వీరంతా భారత పౌరులుగా నిర్ధారణ చేయబడలేదు. గత సంవత్సరం విడుదలైన జాబితాలో 40,07, 707 మంది పేర్లు జాతీయ పౌర జాబితాలో లేవన్నారు. ఇప్పుడు అందులో చాలా మంది పేర్లు చేర్చారు. ఈ పేర్లు చేర్చడానికి కారణం మానవ హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలే. మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవడం వల్లనే చాలా మంది న్యాయం పొందగలిగారు.

తమ పేరు జాబితాలో చూసుకోగలిగా రు. మానవ హక్కుల సంఘాలు ఈ సమస్యలో చాలా చురుగ్గా పని చేశాయి. వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చాయి. అవసరమైన డాక్యుమెంట్లను సేకరించడం, వాటిని ఒక క్రమంలో ఉంచి ఎన్‌ఆర్‌సి అధికారులకు అందజేయడం వంటి పనుల్లో ప్రజలకు సహకరించారు. ఇప్పుడు మిగిలిన 19 లక్షల మందిలోను అనేక మంది భారత పౌరులు ఉండవచ్చు. వారందరికీ అవసరమైన సహాయ సహకారాలు అందించే గురుతర బాధ్యత ఇప్పుడు మానవ హక్కుల సంఘాలపై ఉంది. ఎన్‌ఆర్‌సి కావాలని చాలా మంది కోరుతూ వచ్చారు. కాని ఎన్‌ఆర్‌సి తుది ప్రతి వచ్చిన తర్వాత అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీలు అసోంలో చాలా పెద్ద సంఖ్యలో అక్రమ బంగ్లాదేశీ ప్రవాసులు న్నారని ప్రచారం చేస్తూ వచ్చాయి. దాదాపు 30 నుంచి 50 లక్షల మంది అక్రమ బంగ్లాదేశీలు ఉన్నారని హోరెత్తించారు. ఈ అక్రమ ప్రవాసుల సమస్య కారణంగానే అసోంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చాలా నిరుత్సాహాన్ని ప్రకటించింది. చాలా తక్కువ సంఖ్యలో అక్రమ ప్రవాసులు ఉన్నట్లు ఈ ఎన్నార్సీ వల్ల తేలింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్‌ఆర్‌సి కోసం చాలా ఉత్సాహంగా ప్రచారం చేశారు. చాలా పెద్ద సంఖ్యలో ముస్లింల పేర్లు ఎన్‌ఆర్‌సిలో రావని అనుకున్నారు. వాళ్ళంద రిని బంగ్లాదేశ్‌కు బహిష్కరి స్తామన్నారు. ఇప్పుడు ఎన్‌ఆర్‌సి లో పేర్లు లేని వారెవరన్నది అధికారి కం గా ప్రకటించలేదు.

వారి పేర్లు ప్రకటించడం జరగ లేదు. కాని అనధికారిక వార్తల ద్వారా తెలుస్తున్నదేమంటే, ఎన్‌ఆర్‌సిలో పేర్లు లేని వారిలో దాదాపు లక్ష మంది నేపాలీ హిందువులు. చాలా పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు బీహారీలు కూడా ఉన్నారని వార్తలు చెబుతున్నాయి. ఇప్పుడు బిజెపి నాయకులు కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో అక్రమ ముస్లిం ప్రవాసులను ఎన్‌ఆర్‌సిలో చేర్చారని ఆరోపిస్తున్నా రు. అందువల్ల ఎన్‌ఆర్‌సి రీ వెరిఫికేషన్ జరగాలంటున్నారు. ఎన్నిసార్లు రీ వెరిఫికేషన్ చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రీ వెరిఫికేషన్ కు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టంగా కనిపించే వాస్తవమేమిటంటే, ఎలాంటి ఖచ్చితమైన విధానం లేకపోవడం. ఎన్‌ఆర్‌సి తయారు చేశారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో 19 లక్షల మంది పేర్లు ఎన్‌ఆర్‌సి లో లేవు. ఈ ప్రజలందరి విషయంలో ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు జవాబు స్పష్టంగా లేదు. కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని ఈ ప్రశ్నకు స్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. బంగ్లాదేశ్‌కు బహిష్కరించడం అనేది సాధ్యం కాని పని. వీరం దరినీ బంగ్లాదేశ్ మారు మాట్లాడకుండా మా పౌరులే అని తీసు కుంటుందంటే ఎవరూ నమ్మలేరు. అయినా, ఎన్‌ఆర్‌సిలో పేర్లు లేని వారు బంగ్లాదేశీలే అని నిరూపించడం ఎలా? భారతదేశంలో రాజకీయ నాయకులు అక్రమ ప్రవాసులనే సమస్యను ఎన్నికల్లో చాలా వీరావేశంతో ప్రస్తావిస్తుం టారు కాని, ఎంత మంది అక్రమ ప్రవాసులు ఉన్నారనే లెక్కలేవీ లేవు.

కొందరు దాదాపు 30 నుంచి 50 లక్షల మంది అక్రమ ప్రవాసులు ఉంటారని చెబుతున్నారు. జనాభా లెక్కలు మాత్రమే కొంత వరకు నమ్మదగ్గ ఆధారాలు. 1951 నుంచి 2001 మధ్య కాలంలో అసోంలో జనాభా పెరుగుదలను, జాతీయ జనాభా పెరుగుదల రేటుతో పోల్చితే 19,44,444 మంది ప్రజల తేడా వస్తుంది. ఈ సంఖ్య తర్వాత పెరిగి దాదాపు 40 లక్షల వరకు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో బెంగాలీ మాట్లాడే ముస్లింలు 17 లక్షల మంది ఉండవచ్చని కొందరి అంచనా. మిగిలిన వారు నేపాలీలు, హిందీ, బెంగాలీ మాట్లాడే హిందువులు. మరోవైపు భారత ద్వీప కల్పంలోని మానవ హక్కుల సంఘాలు ఎన్‌ఆర్‌సి సందర్భంగా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రారం భించాయి. జులై 2018 ఎన్‌ఆర్‌సి ముసాయిదా ప్రతిలో పేర్లు లేని వారికి సహాయ సహకారాలు అందించాయి.

అయితే ఈ మానవ హక్కుల సంఘాలు నిర్దిష్ట చట్రంలో మాత్రమే పని చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌సిలో పేర్లు లేని వారికి సహాయపడడం వరకు మాత్రమే ఆలోచిస్తున్నాయి. కాని, అసోం ప్రజలు ప్రవాసులపై వ్యతిరేకత పెంచుకోడానికి కారణమే మిటన్నది ఆలోచించడం లేదు. త్రిపురలో ఏం జరిగిందో అసోం ప్రజలు చూశారు. త్రిపురలో 1951లో స్థానిక ఆదివాసీ జనాభా 59.1 శాతం ఉండేది.

2011 నాటికి ఈ జనాభా 31.1 శాతానికి తగ్గిపోయింది. ఏడు లక్షల మంది బంగ్లాదేశ్ ప్రవాసులు త్రిపురలోకి 1960 వరకు వచ్చారు. ఇందులో కేవలం రెండు లక్షల మంది మాత్రమే 1951కి ముందు వచ్చిన వారు. వాళ్ళు దేశ విభజనలో వచ్చిన శరణార్థులు. అసోం ఎన్‌ఆర్‌సిలో పేర్లు లేని వారికి హక్కుల సంఘాలు సహా యం చేస్తున్నాయి. కాని ఈ సంఘాలు ఈ సమస్యను గుర్తించడం లేదు. లేదా ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. నిర్బంధ శిబిరాల్లో అమానుష పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం మంచిదే. కాని స్థానిక అసోమీ ప్రజలకు, ప్రవాసులుగా ముద్ర పడిన వారికి మధ్య సానుకూల, సంప్రదింపుల వాతావరణం ఏర్పరిచే దిశగా వాళ్ళు పని చేయడం లేదు. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఎన్‌ఆర్‌సిలో పేర్లు రాని వారి హక్కుల విషయమై పని చేస్తున్నప్పుడు అసోమీలను విమర్శించడం సరికాదు.

ఒకే రాష్ట్రం ఈ శరణార్థులందరిని భరించాలని చెప్పడమూ సరికాదు. త్రిపురలో జరిగిం ది ఇదే. అక్కడి స్థానికులు తమ గుర్తింపు, తమ భూముల కోసం తిరగబడ్డారు. త్రిపురలో ఆదివాసీ తెగలు మైనారిటీ స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి స్థానిక తెగల హక్కుల విషయంలో కూడా ఆలోచించాలి. ఎన్‌ఆర్‌సిలో చోటు దక్కని వారి హక్కుల విషయం గురించి ఆలోచించడంతో పాటు అసోం రాష్ట్రం, ఇక్కడి స్థానిక తెగల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎన్‌ఆర్‌సిలో పేర్లు లేని వారిని బంగ్లాదేశ్ బహిష్కరించడం సాధ్యం కాదు. చదరపు కిలోమీటరుకు 14 వందల మంది బంగ్లాదేశ్ లో నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ ఈ ప్రజలను స్వీకరించడానికి ముందు కు రాదు. ఈ ప్రజల మానవ హక్కుల గురించి అసోంను విమర్శించడం కూడా సరికాదు. పూర్తి దేశంపై ఈ బాధ్యత ఉంది.

ఈ సమస్యకు పరిష్కారమేమిటి. ఓటు హక్కు లేకుండా వర్క్ పర్మిట్లను ఇవ్వగలమా? పౌరసత్వ చట్టం ద్వా రా మతం ప్రాతిపదికన పౌరస త్వం ఇచ్చే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తే, అంటే బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన తదితర మతాల వారికి ఆటో మేటిగ్గా పౌరసత్వం ఇచ్చి, ముస్లిములకు మాత్రం పౌరసత్వం నిరా కరించే నిబంధనలు ప్రవేశపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? భూమి హక్కులు, గుర్తింపుల సమస్యను మత సమస్యగా మార్చేయడం జరిగి తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నల పై ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.

 

Assam National Citizen List release