Home తాజా వార్తలు స్టాంప్ డ్యూటీ స‌వ‌ర‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

స్టాంప్ డ్యూటీ స‌వ‌ర‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Assembly Approves Stamp Duty Amendment Billహైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో స్టాంప్ డ్యూటీ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జరిగింది. అనంతం స్టాంప్ డ్యూటీ స‌వ‌ర‌ణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సభ ను శుక్రవారం నాటికి వాయిదా వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ పల్లె, పట్టణ ప్రగతిపై సుధీర్ఘ వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్ర‌శ్నోత్తరాల్లో భాగంగా చేప‌ల పెంప‌కానికి ప్రోత్సాహం, రేషన్ కార్డుల జారీ, అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ‌, క‌ల్యాణ‌ల‌క్ష్మి – షాదీముబార‌క్‌, ఆర్టీసీ కార్గో సేవ‌లపై  చర్చించారు.