Home జాతీయ వార్తలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

Bihar-election-sheduleబీహార్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ బుధవారం విడుదల చేసింది. 243 సీట్లకు గాను మొత్తం ఐదు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఫెజ్1 అక్టోబర్ 12న, ఫెజ్2 అక్టోబర్ 16న, ఫెజ్3 అక్టోబర్ 28న, ఫెజ్4 నవంబర్ 1న, ఫెజ్5 నవంబర్ 5న జరగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 8న జరగనుంది. మొత్తం 243 సీట్లు ఉండగా వీటిలో 47 సీట్లు నక్సల్స్ ప్రభావితమైనవిగా గుర్తించారు. బీహార్‌లో మొత్తం 6.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం.