Friday, April 19, 2024

అసెంబ్లీలో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్లు: వేముల

- Advertisement -
- Advertisement -

Assembly meeting start as soon as

 

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సన్నదంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సభ్యులకు రావాల్సిన సమాధానాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని, సిఎస్ ఆధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పార్లమెంట్ గైడ్‌లైన్స్ పాటిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ మండలిలో హాల్‌లో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్లు ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. శాసన సభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశామని వేముల వివరించారు. శాఖల వారీగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకున్నామని, పిపిఇ కిట్లు, ర్యాపిడ్ కిట్లు, ఆక్సీమీటర్లు, అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. శాసన సభ, మండలిలో రెండు చొప్పున అంబులెన్స్ అందుబాటులో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్ రెండు రోజుల ముందే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అసెంబ్లీ సెక్రెటరీ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు చేస్తామని వెల్లడించారు. కరోనాపై అవగాహన ఉన్న వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News