Home జాతీయ వార్తలు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమే‌శ్‌ నిరాహార దీక్ష

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమే‌శ్‌ నిరాహార దీక్ష

Assembly Opposition Leader Ramesh Hunger Strikeతిరువనంతపురం: దౌత్య మార్గంలో దుబాయ్ నుంచి కేరళకు బంగారాన్ని అక్రమంగా తరలించిన వ్యవహారంలో కేరళ సిఎం పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు.  సోమవారం తన నివాసంలో ఆయన ఈ దీక్షను చేపట్టారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్న సురేశ్ తో పాటు సిఎం మాజీ ప్రధాన కార్యదర్శి, సిఎం విజయన్ కు సంబంధాలు ఉన్నాయని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని రమేశ్ డిమాండ్ చేశారు. బంగారం అక్రమ రవాణా వ్యవహారం కేరళలో సంచలమైంది. ఈ అంశంపై కాంగ్రెస్ కూడా ఆందోళనలు నిర్వహించింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బిజెపి 18  రోజుల పాటు సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఎ ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసింది. ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ సిఎం విజయన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కేరళలో బలంగా వినిపిస్తోంది.