Home అంతర్జాతీయ వార్తలు కృష్ణబిలం.. జ్వలిత చిత్రం

కృష్ణబిలం.. జ్వలిత చిత్రం

Black-Holeఅపూర్వ చిత్రం ఆవిష్కృతం

పారిస్ : విశ్వ పరిణామంలో విశేష శేషప్రశ్నగా మారిన కృష్ణబిలం అపురూప చిత్రం ఇప్పుడు ఆవిష్కృతమైంది. ఖగోళ శాస్త్రజ్ఞుల విశేష పరిశోధనల ఫలితంగా అత్యంత శక్తివంతమైన టెలీస్కోప్‌ల ద్వారా ఈ బ్లాక్‌హోల్ దృశ్యాలతో కూడిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేశారు. అత్యంత ఆకర్షణశక్తి వలయాలతో ఉండే దుస్సాధ్య ఖగోళ వింతలుగా ఈ నల్లచుక్కలు తరాలుగా అద్భుతాలను సంతరించుకుని ఉన్నాయి. నక్షత్రాలను కబళించే ఖగోళ బిలాలుగా వీటికి పేరుంది. రోదసిలో సుదూరంలో పాలపుంతల మధ్య ఉన్న ఈ బిలం సుమారు 40 బిలియన్ల కిలోమీటర్ల వెడల్పులో ఉన్నట్లు తేలింది. భూమి కన్నా దాదాపు 30 లక్షల రెట్లు పెద్దగా ఉందని వెల్లడైంది. భూమికి సుమారు 500 ట్రిలియన్ల కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ బిలం చుట్టూ ఎగిసిపడే భారీ స్థాయి జ్వాలలు చివరికి ఎక్కడి నుంచి కూడా చిన్నపాటి కాంతిని కూడా దరిదాపులలోకి రానివ్వవు. అటువంటి కృష్ణబిలం ఫోటోను తీయడం ఖగోళ పరిశోధనలలో అరుదైన విజయంగా భావిస్తున్నారు.

విశ్వంలో అక్కడక్కడ ఈ కృష్ణబిలాలు పొదిగినట్లుగా ఉన్నాయి. ఈ బిలాల చుట్టూ నారింజ రంగు మంటల వలయం నెలకొని ఉంది. తెల్లటి జ్వాలల చివరన ఉండే రంగులతో ఉండే ఈ కృష్ణ బిలం చిత్తరువు ఇప్పుడు 30 ఏళ్ల పరిశోధనల తరువాత సాక్షాత్కరించిన కళాకారుడి చిత్తరువుగా వెలువడింది. కృష్ణబిలాల గురించి నిజానికి 18వ శతాబ్దం నుంచే ప్రశ్నలు తలెత్తుతూ వస్తున్నాయి. అయితే గత టెలీస్కోప్ ద్వారా ఈ బ్లాక్‌హోల్ ఫోటోను తీయడం ఇదే తొలిసారి అయింది.

భూమికి 50 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌హోల్ ఎం 87 గెలాక్సీలో ఉంది. ఫ్రాన్స్‌లోని జాతీయ శాస్త్రీయ పరిశోధనా కేంద్రంలో ఖగోళ శాస్త్రజుడు ఫ్రెడిరిక్ గుయెత్ ఈ ఆవిష్కరణలను ప్రపంచానికి చిత్రాల ద్వారా వెల్లడించారు. ఈవెంట్ హారిజన్ టెలీస్కోప్ ద్వారా ఈ బ్లాక్‌హోల్ వేట సాగింది. ఇంతకు ముందు ఈ టెలీస్కోప్‌తోనే సాగిటేరియస్ ఎ అనే బ్లాక్‌హోల్‌మధ్య ప్రాంతాన్ని ఫోటోలు తీశారని తెలిపారు. ఈ కృష్ణబిలం భూమికి మన పాలపుంతల మధ్య భూమికి 26000 కాంతిసంవత్సరాల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బిలం భూమికి మరింత దూరంలో ఉంది. ఇది సూర్యుడి కన్నా అత్యంత భారీ పరిణామంలో ఉన్నట్లు వెల్లడైంది.

Astronomers Capture First Ever Image of a Black Hole