Home జాతీయ వార్తలు కాబూల్‌లో బాంబు దాడులు: 8 మంది మృతి

కాబూల్‌లో బాంబు దాడులు: 8 మంది మృతి

At least 8 dead in kabul bomb blast

 

కాబూల్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని వివిధ ప్రదేశాలో గుర్తుతెలియని దుండగులు జరిపిన బాంబుల దాడిలో 8 మంది మృతిచెందగా 31 మందికిపైగా గాయపడ్డారు. రెండు కార్లలో వచ్చిన దుండగులు 23 మోర్టారు బాంబులను పేల్చారని ఆంగరింగక మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడికి ఇప్పటివరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదని ఆయన చెప్పారు. దౌత్యకార్యాలయాలు ఉండే కాబూల్‌లోని వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. కాగా.. ఈ దాడితో తమకు సంబంధం లేదని తాలిబన్ తక్షణమే స్పందించింది.

At least 8 dead in kabul bomb blast