Sunday, March 26, 2023

కందుల కేంద్రంలో రైతుల సందడి

- Advertisement -

seeds

* ప్రభుత్వ చొరవతో దళారీ వ్యవస్థ దూరం
* ఎమ్మెల్యే, జడ్‌పి చైర్‌పర్సన్‌ల కృషి ఫలితం గత జనవరి 22న ప్రారంభం
* ఆరు మండలాల కందిపంట రైతులకు లాభం
* ఇప్పటి వరకు 2400 కందుల బస్తాలు కొనుగోలు
* నర్సాపూర్ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు సందడి
* ఎంతో లాభం కలుగుతుందంటున్న రైతులు

మన తెలంగాణ/నర్సాపూర్ : నర్సాపూర్ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో ఎం తో లాభం కలుగుతుందంటూ రైతన్నలు మురిసిపోతూ కందుల అమ్మకాల కోసం పెద్దెత్తున మార్కెట్ యార్డుకు చేరుకుంటున్నారు. పండించిన కందుల పంటలకు ఇప్ప టి వరకు నర్సాపూర్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక, ఎన్నో సంవత్సరాలుగా దళారుల చేతుల్లో మోసపోతూ అరకొర ధరలకు అమ్ముకుని ఎన్నో ఇబ్బందులు పడ్డ రైతన్నలకు, మేలు జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో జనవరి 22న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్‌పిచైర్‌పర్సన్ రాజమణి చొరవతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నర్సాపూర్ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటై నా కందుల కొనుగోలు కేంద్రంతో, మార్కెట్ యార్డు పరిధిలోని హత్నూర, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల రైతులకు ఎంతో లాభం చేకురుతుందన్నది నిజం.
ప్రారంభం కన్నా ఇప్పుడు పంట బాగా వస్తుంది : జనవరి 22 న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా సంయుక్త పాలన అధికారి నాగేష్‌తో కలిసి కందుల కొనుగోలు కేంద్రాని ప్రారంభిచగా మొదట్లో రైతుల నుండి అంతగా మొగ్గు చూపలేక పొయారని, రానురాను రైతులు తమ కంది పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే పోటీ పడి తీసుకువస్తున్నారని, వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. మార్కెట్ యార్డులో ఓపన్ ప్లాట్‌ఫాంలు ఉండటం, అదేవిదంగా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 5,250ల మద్దతు ధర చెల్లిస్తూ, 200 బోనస్‌గా, మొత్తం రూ.5450లను నేరుగా ఆన్‌లైన్‌లో రైతు ఖాతల్లో డబ్బులు జమ చేస్తున్నందున రైతులు పోటీ పడి పంటను తెస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 2400 బస్తాలను కొనుగోలు చేయడం జరిగిందని వారు అన్నారు.
దళారి వ్యవస్థకు చెక్ : గతంలో కంది పంట వేసుకుని అమ్ముకునే సమయంలో దళారుల చేతుల్లో మోసపొయామని, ఇప్పుడు దళారి వ్యవస్థకు చెక్ పెట్టినట్టు అయ్యిందని, తుల్జారాంపేట తాండ రైతు పుణ్యనాయక్ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక పండించిన కందులను దళారుల చెంతకు తీసుకు పోతే ధరలో మోసం, తూకంలో మోసం చేస్తూ రైతులను అన్నివిధాల మోసం చేశారని అన్నారు. నర్సాపూర్ పట్టణంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మాలాంటి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పుణ్యనాయక్ అన్నారు.
మంచి తూకం అధిక లాభం : ప్రభుత్వ కందుల కొనుగోలు కేంద్రంలో తూకం బాగుందని, అదేవిదంగా రైతుకు మంచి మద్దతు ధర లభిస్తుందని, మండల పరిధిలోని అహ్మదాబాద్ నర్సింగ్ తాండ రైతు గన్య అన్నారు. తెచ్చిన కందులను సిరియల్‌తో ఉండి జెల్లెడలో కందుల నాణ్యతను చూసిన వెంటనే ఎటువంటి మోసం లేకుండ తూకం వేస్తున్నారని అన్నారు. దళారుల చేతుల్లో క్వింటాల్‌కు రూ.3500 నుండి రూ.4200 వరకు మాత్రమే ధర చెల్లించె వారని ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.5450 ధర చెల్లిస్తున్నారని నేరుగా రైతు భ్యాంక్ ఖాతల్లో డబ్బులు జమ కావడం రైతుకు ఎంతో లాభంగా ఉందని గన్య నాయక్ ఆనందం వ్యక్తం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News