*అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు
మనతెలంగాణ/సదాశివనగర్: మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపిపి విజయశివకుమార్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మండల గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉండగా పలు శాఖల అధికారులు గైర్హాజరులు కావ డం, సభకు సమయానికి రాకపోవడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిష న్ భగీరథ, ఉపాధి హామీ, ఐసిడిసి, ఐకెపి ఉద్యానవన, పంచాయతీ రాజ్ శాఖాధికారుల పనితీరు పట్ల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు నిరసన వ్యక్తం చేసి నిలదీసారు. మిషన్ భగీరథ పనుల వివరాలను అడిగిన జడ్పిటిసి మార్చి 5వరకు భగీరథ నీళ్లను ప్రజలకు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ప్రణాళికలతో కూడిన పనులు చేయాలని అధికారులకు తహసీల్దార్ అమీన్‌సింగ్, వైస్ ఎంపిపి రూపేందర్‌రెడ్డి సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సత్యనారాయణ సాయంత్రం అల్పాహారం గురించి జిల్లాకు రూ.10లక్షలు ఇచ్చినందుకు ఎంఇఓ యోసఫ్, అధికారులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ చంద్రశేఖర్, ఎఎంసి చైర్మన్, సిడిపిఓ సంధ్యారాణి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.