
- Advertisement -
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని, బిజెపి వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్ పేయి (93) కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఆయనపై ఇటువంటి వార్తలు రావడంతో నిజానిజాలు తెలియక నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలావుండగా 2015లో కూడా వాజ్ పేయిపై ఇటువంటి తప్పుడు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు పెద్ద దూమారంలేసింది. వాజ్ పేయి మృతిచెందారంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సెలవు ప్రకటించాడు కూడా. ఇది తప్పుడు వార్త కావడంతో నాడు సదరు ప్రధానోపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వాజ్ పేయిపై వచ్చిన వార్తల్లో నిజంలేదని, ప్రభుత్వ, బిజెపి వర్గాలు తేల్చిచెప్పాయి. ఇటువంటి పుకార్లను నమ్మొద్దని ఆయా వర్గాలు ప్రజలకు సూచించాయి.

- Advertisement -