Home జాతీయ వార్తలు చట్టాలకు మీరు అతీతులా?

చట్టాలకు మీరు అతీతులా?

supreme-courtఆహార భద్రతా చట్టం అమలు చేయనందుకు   గుజరాత్ రాష్ట్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : ‘గుజరాత్ ఇండియాలో లేదా? అక్కడ జాతీయ ఆహార భద్రతా చట్టం ఎందుకు అమలు చేయడం లేదు? ఈ పథకం దేశానికి అంతటికీ వర్తిస్తుందని చట్టం చెపుతోంది. అయితే గుజరాత్ ఎందుకు దీనిని అమలుచేయడం లేదు’ అని సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా ప్రశ్నించింది. దేశంలో కొన్ని రాష్ట్రాలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎ), ఆహార భద్రతా చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవ డంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీ య భద్రతా చట్టం వంటి జాతీయ సంక్షేమ చట్టం అమలుకు చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా ఉన్న రాష్ట్రాల వైఖరిని జస్టిస్ మదన్ బి లోకూర్‌తో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. గుజరాత్ ప్రభుత్వ వైఖరి విడ్డూరంగా ఉందని ఇప్పుడు ఈ రాష్ట్రం పార్లమెంట్‌లో రూపొందిన చట్టాన్ని పక్కకు పెట్టిందని ఇదేమీ తీరు అని ధర్మా సనం ప్రశ్నించింది. రేపు వేరే రాష్ట్రంలో తాము ఐపిసిని, ఎవిడెన్స్ యాక్ట్‌ను, సిఆర్‌పిసిని తాము అమలుచేయడం లేదని చెపితే ఎలా అని ప్రశ్నించారు. ఈ దశలో పార్లమెంట్ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. దేశంలోని రాష్ట్రాలన్నింటి లో చట్టం అమలు కావాల్సి ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా వ్యవ హరించడం అనుచితమే అవుతుందని న్యాయమూర్తి లోకూర్ ఆక్షేపించారు. సంక్షేమ పథకాలైన ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం అమలు పరి స్థితిపై కరువు పీడిత రాష్ట్రాల నుంచి కేంద్రం తగు సమాచారం తెప్పించు కోవాలని, అదే విధంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులను కూ డా విశ్వేషించుకోవల్సి ఉందని తెలిపారు. కేంద్రం తన వివరణను ఈ నెల పది లోగా అఫిడవిట్ ద్వారా తెలియచేసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. కేంద్ర చట్టాలు ప్రత్యేకించి ఉపాధి పథకాలు, ఆహార చట్టం, మధ్యాహ్న భోజన పథకం వంటివాటిపై గత నెల 18న కేంద్రా నికి సుప్రీంకోర్టు తగు సమాచార వివరణను కోరింది. కరువు పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాలలో తగు విధంగా కనీస ఉపాధి , ఆహార కల్పన పథకాల అ మలు జరుగుతోందా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, బీహార్ వంటి పలు రాష్ట్రాలలో కరువు పరిస్థి తులు ఉన్నాయని అయితే అక్కడ అధికారులు తగు విధంగా ప్రజలకు ఉపాధి కల్పించడం లేదని, పనులు లేకపోవడంతో వలసలకు దిగాల్సి వస్తోందని, ప్రజ ల కడగండ్లపై ప్రభుత్వాలు స్పందించడం లేదని స్వచ్ఛంద సంస్థ స్వరాజ్ అభియాన్ దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యం (పిల్)పై ధర్మాసనం విచారణ జరుపుతోంది. కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత కరువు పరిస్థి తులలోనూ అత్యంత కీలకమైన సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయ కుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం దారుణమని, ప్రత్యేకించి మధ్యా హ్న భోజన పథకం అమలులో లోపాలతో పిల్లలకు పలు ఇక్కట్లు ఎదుర వుతున్నాయని సంస్థ తరఫున పిల్ దాఖలు చేసిన న్యాయవాది ప్రశాంత్ భూష ణ్ న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.