Home వార్తలు ఎటిఎంలకు ఇంటి దొంగలు

ఎటిఎంలకు ఇంటి దొంగలు

నగదును నింపే కంపెనీలు, ఉద్యోగులే దొంగలుగా మారుతున్న వైనం
ఓవైపు చోరీలు, నకిలీ నోట్ల చేర్పు
దోచుకున్న సొత్తుతో వడ్డీ వ్యాపారాలు, క్రికెట్ బెట్టింగ్‌లు, బీమా సంస్థలకూ టోకరా

ATMమన తెలంగాణ/ హైదరాబాద్ : జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలోని పలుచోట్ల, ఎటిఎంలకు ఇంటి దొంగల బెడద తీవ్రమయింది. ఎటిఎంలలో నగదు నింపే ఉద్యోగులు, కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కై పాస్ వర్డ్‌లను తస్కరించి భారీగా నగదును దోచుకుంటూ జల్సాలకు పాల్పడుతూ వడ్డీ వ్యాపారాలు, క్రికెట్ బెట్టింగ్‌లు చేస్తూ, నకిలీ నోట్లను అమర్చుతూ బ్యాంకింగ్, పోలీసు వ్యవ స్థలను అపహాస్యం చేస్తున్నారు. తె లుగు రాష్ట్రాల్లో వరు సగా జరుగుతున్న ఈ తరహా నేరాలు ఆలస్యంగా వెలు గు చూడడం వెనుక బ్యాంకింగ్ వ్యవస్థలోని రక్షణ యంత్రాగం లోపో భూయిష్టంగా వుండడం ఒక ఎత్తయి తే, నేరగాళ్లు పట్టుబడిన తరువాత చోరీ అయిన నగదు పూర్తిగా లభించక పోవడం మరో ఎత్తుకాగా ఈ మొత్తం వ్యవహాకంలో బీమా సంస్థలు గుడ్డిగా చెల్లింపులు జరుపు తుండడం ముఖ్యాంశంగా చెప్పాలి.
ఒకప్పుడు ఎటిఎంలపై దోపిడి దొంగలు దాడిచేసి అందులోని నగదును దోచుకునే ఘటనలు జరి గేవి. చాలా సందర్భాల లో ఎటిఎంల నుంచి నగదు తస్కరిం చలేక దొంగలు వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఎటిఎ ంలను దొంగల నుంచి కాపాడేందుకు బ్యాంకుల అధికా రులు తీసుకున్న పకడ్బందీ చర్యల వల్లే ఇది సాధ్యమ య్యిందనేది నిర్వివాదాంశం. దొంగల నుంచి ఎటిఎం లను కాపాడేందుకు ఇన్ని రకాల చర్య లు తీసుకున్న అధికారులు ఇంటి దొంగల నుంచి వాటిని కాపాడుకునే ందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం విశేషం. గడచిన కొన్నేళ్లుగా ఎటిఎంలలో నగదు నిలువ వుంచే ఉద్యోగులు తెలివిగా పాస్ వర్డ్‌లను తస్కరించి పెద్ద మొత్తంలో నగదును చోరీ చేస్తున్నారు. కొన్ని సం దర్భాలలో ఈ నగదును చోరీ చేసిన ఉద్యోగులు వారం పది రోజుల తరువాత తిరిగి ఎవరికి అనుమానం రాకుండా తిరిగి పెట్టేస్తున్నారు. ఇంకొ న్నిసార్లు ఎటిఎ ంల నుంచి నగదు కాజేస్తున్న ఉద్యోగులు వాటిని వడ్డీ వ్యాపారులకు పక్షం రోజులు లేదా నెల రోజులకు ఇస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. గడువు ముగిసిన తరువాత చోరీ చేసిన నగదును తిరిగి ఎటిఎంలలో వుంచేస్తు న్నారు. ఇంకొందరు ఉద్యోగులు తాము చోరీ చేసిన న గదు స్థానంలో నకిలీ నోట్లను వుంచుతూ పబ్బం గడుపు కుంటున్నారు. ఎటిఎంల నుంచి డ్రా చేసిన నగదులో నకిలీ నోట్లు వచ్చిన సందర్భాలలో ఖాతాదారులకు న్యా యం జరగడం లేదు. తాము పలానా ఎటిఎంల నుంచి డబ్బులు డ్రా చేస్తే నకిలీ నోట్లు వచ్చాయని, వీటిని మా ర్చాలని ఎవరైనా ఖాతాదారులు ఆయా బ్యాంకుల వద్ద కు వెళ్లిన సందర్భాలలో కూడా వారికి న్యాయం జరగ డం లేదు. వీటితో తమకు సంబంధం లేదని బ్యాంకుల అధికారులు సమాధానాలు ఇస్తున్నారు. ఎటిఎంల లో దొంగనోట్లు ఎలా వస్తున్నాయనే..? అంశంపై ఇంత వరకు ఏ బ్యాంకు కూడా సరైన విచారణ చేయక పోవడం గమనార్హ ం. ఇక మూడో ఘటనలో ఎటిఎంల నుంచి భారీగా నగదు చోరీ చేస్తున్న కొందరు ఉద్యోగులు వాటితో తాగి తందనాలాడడంతో పాటు జల్సాలు చేస్తూ, అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేస్తూ పట్టుబడినంత కాలం ఖుషీ ఖుషీగా జీవితం గడుపుతున్నా రు. ఇంకొందరు ఏకంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ అంతర్జాతీయ బుకీలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తుకారంగేట్ పరిధిలో ఓ జాతీయ బ్యాంకుకు చెందిన తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఎటిఎంలలో నింపాల్సిన ఓ కంపెనీ ఆ డబ్బులను జల్సాలతో పాటు సొంత అవసరాలకు వాడుకుంది. ఇందులో నాలుగున్నర కోట్ల రూపాయలను క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టగా మిగతా సొ మ్ములొ కొంత ఉద్యోగులు, ఇంకొంత కంపెనీ పెద్దలు కాజేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారు. దీనిపై విచారణ సాగుతోంది.
పాస్ వర్డ్‌లపై కొరవడిన నిఘా, ఉద్యోగుల ఎంపికలో అడ్డగోలు విధానాలు
ఇదిలావుండగా ఎటిఎంల నుంచి నగదును కాజేస్తున్న కొందరు ఉద్యోగులు ఇందుకుగానూ పాస్ వర్డ్‌లను తస్కరిస్తున్న తీరు షాక్‌కు గురిచేస్తు ండడం విశేషం. పాస్ వర్డ్‌లు కొంత మంది అధికారుల వద్దే వుంటాయి. కొందరు ఉద్యోగులకు తెలిసినా వారిపై నిరంతర నిఘా వుండాలి. కానీ అలా జరగక పోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాచారంలో వెలుగు చూసిన ఘటన తరహాలో భారీగా నగదును అపహరిస్తు న్నారు. ఇక ఎటిఎంలలో నగదును నిలువ వుంచేందుకుగాను కంపెనీలను, ఉద్యోగులను ఎంపిక చేసే విధానం కూడా అడ్డగోలుగా వుంటోంది. ఎటిఎంలలో నగదు నిలువ వుంచేందుకు ఎంపిక చేసే కంపెనీలు, ఉద్యోగుల నియామకం సరిగ్గా వుండడం లేదని పోలీసులు అనేకసార్లు బ్యాం కులకు లేఖలు రాసినా వారి నుంచి స్పందన కరువైంది. ఇక ఎటిఎంలలో వుండే నగదుపై ప్రతిరోజు ఆడిటింగ్ చేయాల్సి వున్నా ఇవి నాంకే వాస్తే గా మారాయని నాచారం ఘటన తేటతెల్లం చేసింది. ఆడిటింగ్ సరిగ్గా జరిగితే ఏడాది క్రితం నాచారంలో వెలుగు చూసిన ఎటిఎంలలోని నగదు దోపిడి నాలుగు నెలలు ఆలస్యంగా వెలుగు చూసే బదులు నాలుగు రోజులకే రట్టయి వుండేది. ఇక తాజాగా తుకారంగేట్ పరిధిలో జరిగిన భా రీ చోరీ సైతం ఆలస్యంగా వెలుగు చూడడం మరో ఉదాహరణగా చెప్పాలి. మరోవైపు. ఎటి ఎంలలో వుండే సిసి కెమెరాలు సైతం నాంకే వాస్తే అన్నట్లుగా మారాయి. చాలా చోట్ల ఇవి పనిచేయక పోగా కొన్ని చోట్ల నామమాత్రంగా పనిచేస్తున్నాయి. ఎటిఎంలలో నగదు చోరీ చేసిన ఇంటి దొంగలు పట్టుబడిన సందర్బాలలో వారి వద్ద నుంచి చోరీ సొత్తు పూర్తిగా లభించకుంటే బీమా సంస్థల నుంచి బలవంతంగా క్లెయికులు పొందుతు ండడం మరో విశేషం. ఇంటి దొంగలు ఎటిఎంల నుంచి చోరీ చేస్తే దానికి బీమా సంస్థలు ఎలా బాధ్యత వహి స్తాయో బ్యాంకుల అధికారులే సమాధానం చెప్పాలి. మొత్తం మీద ఎటిఎంలకు దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బ్యాంకులు ఇంటి దొంగల నుంచి మాత్రం భద్రత కల్పించకలేక పోతుండడం విశేషం.