Home అంతర్జాతీయ వార్తలు పీసా టవర్‌పై దాడికి కుట్ర

పీసా టవర్‌పై దాడికి కుట్ర

PEESA-TOWARరోమ్ : ప్రపంచ వింతల్లో ఒకటైన పీసా టవర్ మీద దాడికి కుట్ర జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడికి కుట్ర పన్నినట్లు చెబుతున్న ట్యునీషియన్ దేశస్థుడిని వెంటనే బహిష్కరిస్తూ ఇటాలియన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారని వార్తలు వెలువడ్డాయి. బిలెల్ చియాహొయి(26) అనే వ్యక్తి యూరప్‌లోని జిహాదీల దాడులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పోస్టు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. అతడు పీసా టవర్ మీద దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అతడికి జిహాదీ ఉగ్రవాదులతోను, ఐఎస్‌ఐఎస్‌తోనూ సంబంధాలు ఉన్నట్లు సాక్షాలు లభించడంతో అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఓ జడ్జి ఆదేశించారు. అయితే దాడి కుట్ర గురించి ఇతర వివరాలు లభించలేదు. ఇప్పటికే ఫ్రాన్స్ , బెల్జియం దేశాలలో ఉగ్రవాద దాడులు జరగడంతో , ఆ తరువాత ఇటలీలోని దాడులు జరగొచ్చన్న ఆందోళన ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ హోంశాఖ మంత్రి యాంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకకు కొంతమంది అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి బహిష్కరించారు.