Home జయశంకర్ భూపాలపల్లి విలేకరి శివపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

విలేకరి శివపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Journalist

 

మనతెలంగాణ/మానకొండూర్‌: ములుగు జిల్లా ఏటూరు నాగారం వార్త విలేకరి గంపల శివపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మానకొండూర్ విలేఖరులు రేషవేని తిరుపతి (వెలుగు), దాసరి అంజయ్య(ఐన్యూస్), ముత్యాల రాజారెడ్డి(ఐఎన్‌బిన్యూస్), మంద రాజశేఖర్(ఇందున్యూస్), బి.సదయ్య(వాయిస్‌టుడే) శుక్రవారం స్థానిక సిఐ బూర్గుల సంతోష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్)లో జరిగిన అవినీతిపై ఆధారాలతో సహా వార్తలు రాసిన విలేకరి శివపై దుండగులు దాడి చేసి గాయపరచడం పత్రికా స్వేచ్ఛకు విఘాతంగా భావిస్తున్నామన్నారు. అవినీతి, అక్రమాలను వెలికి తీసి పత్రికల్లో వార్తలు రాసే విలేకరులకు రక్షణ కల్పించాలని కోరారు. శివపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.

Attack on Journalist Shiva in Mulugu District