Home ఆఫ్ బీట్ డ్రోన్లతో దోమలపై పోరు..!

డ్రోన్లతో దోమలపై పోరు..!

Attack on Mosquitoes with Drones

జికాలాంటి వ్యాధులను విస్తరిస్తున్న దోమలను నియంత్రించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) దాని భాగస్వాములు డ్రోన్ సహాయంతో వాతావరణంలోకి వంధ్యత్వ దోమలను విడిచి పెట్టే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించాయి. జికా ఇతర వ్యాధుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చేసే పనుల్లో అణు సాంకేతికతను వినియోగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనట్లు ఐఏఈఏ తెలిపింది. ఐఏఈఏ, ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), స్వచ్ఛంద సంస్థ వుయ్ రోబోటిక్స్‌లు గతేడాది ఈ మేరకు వంధ్య క్రిమి సాంకేతికత (సిట్) ఆధారితంగా డ్రోన్ల నుంచి దోమలను విడిచిపెట్టే విధానాన్ని రూపొందించాయి. ఈ వ్యవస్థను గత నెల్లో బ్రెజిల్‌లో విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్లలో ఉంచే మగ దోమలకు రేడియేషన్‌ను ఉపయోగించి పునరుత్పత్తి సామర్థాన్ని దూరం చేసి వాతావరణంలో విడిచిపెడతారు. అనంతరం ఈ దోమలు ఆడదోమలతో కలిసినప్పటికీ సంతానం కలుగదు. ఫలితంగా దోమలు తగ్గి, వ్యాధి నియంత్రణలోకి వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.