Tuesday, November 29, 2022

అదనపు కలెక్టర్‌పై దాడి… వ్యక్తిపై కేసు నమోదు

- Advertisement -

Attack on wanaparthy joint collector in prajavani

 

మన తెలంగాణ/వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాజనగరంకు చెందిన దివ్యాంగుడు శివకుమార్ మూడు వారాలుగా తనకు పింఛన్ రావడం లేదని, తనకు స్వయంగా ఉపాధి కల్పించాలని వరుసగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ వస్తున్నాడు. గత వారం కలెక్టర్ పాల్గొన్నప్పుడు విన్నవించగా కలెక్టర్ పింఛన్ వస్తోందని సముదాయించినా వినలేదు. తనకు కచ్చితంగా స్వయం ఉపాధి కల్పించాలని భీష్మించాడు. అయితే ఈ వారం కలెక్టర్ ప్రజావాణికి కలెక్టర్ హాజరు కాలేదు. ఆ స్థానంలో స్థానిక సంస్థలు, రెవెన్యూకు చెందిన అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్ హాజరయ్యారు. ఫిర్యాదుదారుడు శివకుమార్ ప్రతీవారంలాగే తన ఫిర్యాదుతో వచ్చి దాని జేసీ(రెవెన్యూ) వేణుగోపాల్‌కు అందజేశారు.

ఆయన పరిశీలిస్తుండగానే తన చెంపపైన కొట్టాడు. దీంతో ఉద్యోగులంతా షాక్‌కు గురవ్వగా తనకు ఏదో మానసిక సమస్య కారణంగానే ప్రతీసారి అధికారులను ఇబ్బందులు పెడుతున్నారని, తనకు పింఛన్ 2014 నుంచి పోస్టాఫీసు ద్వారా అందుతుందని జిల్లా అధికారులు తెలిపారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు దాడికి నిరసనగా ప్రజావాణికి బహిష్కరించి కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. తన విధులకు ఆటంకం కలిగించి తనపై దాడి చేసిన వ్యక్తిపై అదనపు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వనపర్తి రూరల్ ఎస్‌ఐ చంద్రమోహన్ రావు 332 ఐపీసీ కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

Attack on wanaparthy joint collector in prajavani

Related Articles

- Advertisement -

Latest Articles