Sunday, December 3, 2023

మహిళా సర్పంచ్‌పై దాడి… కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Attack on Woman Sarpanch

తెలంగాణ/మెట్‌పల్లిః మండలంలోని రంగారావుపేట గ్రామ మహిళా సర్పంచ్ చొప్పరి గంగుబాయిపై విట్టంపేట సర్పంచ్ ఆకుల రాజారెడ్డి మరియు ఆకుల బుచ్చయ్య మరో వ్యక్తి సోమవారం దాడి చేసి గాయపర్చడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ సదాకర్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. విట్టంపేట సర్పంచ్ ఆకుల రాజారెడ్డి గత నాలుగు రోజుల నుండి రంగారావుపేట గ్రామానికి వస్తూ సర్పంచ్ చొప్పరి గంగు కుమారుడు సతీష్ ను దుర్బాషలాడుతూ వేదిస్తున్నాడు.

తమ ఊరికి వచ్చి మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నావంటూ సర్పంచ్ గంగు కొడుకు సతీష్ ఆకుల రాజారెడ్డిని నిలదీయడంతో కోపోద్రిక్తుడైన రాజారెడ్డి, ఆకుల బుచ్చయ్య, తన అనుచరుడు కలిసి మహిళా సర్పంచ్ చొప్పరి గంగుపై, ఆమె కుమారుడుపై పైపులతో దాడి చేసి గాయపర్చారు. తీవ్ర గాయాలైన వారిని హుటాహుటిన మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతున్నారు. చొప్పరి నాగరాజు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సదాకర్ తెలిపారు.

Attack on Woman Sarpanch in Jagtial District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News