Wednesday, April 24, 2024

ఫంక్షన్ ఉందని పిలిచి లైంగిక దాడికి యత్నం

- Advertisement -
- Advertisement -

Attempt to sexually assault women in Madhapur

మాదాపూర్:  ఫంక్షన్ ఉందని తమ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి పిలిచి ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆల్వాల్‌కు చెందిన చెందిన యువతి (22) నారాయణగూడలోని సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణ్ వర్మ, కంప్యూటర్ సైన్స్ హెచ్‌ఓడి రవీందర్‌లు ఇద్దరు కలిసి జనవరి 24న మాదాపూర్‌లో ఈవెంట్ ఉందిని చందానాయక్‌లో కళ్యాణ్ వర్మ నివాసం ఉండే అపార్టుమెంట్‌కు పిలిచారు.

తన తమ్ముడితో కలిసి వచ్చిన యువతిని ఒక్కదానినే అపార్టుమెంట్‌లోని పిలిచి వచ్చిన యువతిపై ఇద్దరు కలిసి లైంగిక దాడికి యత్నించారు. యువతి కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చి ఆల్వాల్‌కు వెళ్లిపోయింది. జరిగిన సంఘటన తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంపై పిబ్రవరి 9న మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 11వ తేదీన నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై ఐపిసి 354ఎ, 354బి, 342,506ఆర్/డబ్లు, 34 ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Attempt to sexually assault women in Madhapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News