Friday, March 29, 2024

అవినీతి కేసులో ఆంగ్‌సాన్ సూకీకి ఐదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Aung San Suu Kyi jailed for five years for corruption

యాంగోన్ : మయన్మార్ కీలక నేత , నోబెల్ బహుమతి విజేత , ఆంగ్‌సాన్ సూకీకి అక్కడి జుంటా కోర్టు అవినీతి కేసులో ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 6 లక్షల డాలర్ల నగదును , బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్నట్టు సూకీ మీద ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె అవినీతికి పాల్పడినట్టు కోర్టు బుధవారం నిర్ధారించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆమె ఎదుర్కొంటున్న 11 కేసుల్లో ఇదొకటి. మయన్మార్ లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆమెను గత సంవత్సరం ఫిబ్రవరి 1 న అరెస్టు చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతోపాటు పలువురు నేతలను కూడా నిర్బంధం లోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News