Friday, March 29, 2024

ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి..

- Advertisement -
- Advertisement -

Ausis Ex Cricketer Dean Jones dies with Heart Attack

ముంబయి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) కన్నుమూత. గుండె పోటుతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో గంగా బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్ తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు. 1984-1992 మధ్య కాలంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌లో రంగ ప్రవేశం చేశారు. టెస్టు క్రికెట్‌లో 3,631 పరుగుల్ని జోన్స్ సాధించగా.. అందులో 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు కెరీర్‌లో రెండు డబుల్ సెంచరీలు జోన్స్ సాధించాడు. ఇక వన్డే కెరీర్‌లో 7 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 6,068 పరుగులు సాధించారు. వన్డేల్లో జోన్స్ సగటు 44.61గా ఉంది. 1986లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జోన్స్ డబుల్ సెంచరీ సాధించారు. ఆ టెస్టు టైగా ముగిసింది. జోన్స్ వీరోచిత బ్యాటింగ్‌తో ఆసీస్ ఓడిపోయే టెస్టు మ్యాచ్‌ను టైగా ముగించింది. జోన్స్ తన ఫస్టక్లాస్ కెరీర్‌లో 51.85 సగటుతో 19,188 పరుగులు సాధించారు. ఆయన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 324 నాటౌట్.
స్టార్ స్పోర్ట్ దిగ్భ్రాంత్రి…
జోన్స్ మృతిని ఐపిఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్ ధృవీకరించింది. ‘జోన్స్ ఇకలేరు. ఇది చాలా విషాదం. ఈ వార్తను షేర్ చేయడం కలిచి వేస్తోంది. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో జోన్స్ ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి నివాళులర్పిస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక చాంపియన్ కామెంటేటర్. జోన్స్ కామెంటరీకి లక్షలాది అభిమానులున్నారు. ఆయన్ని మాతో పాటు ఫ్యాన్స్ కూడా మిస్సవుతున్నందుకు చింతిస్తున్నాం’ అని స్టార్ స్పోర్ట్ ప్రకటనలో తెలిపింది.

Ausis Ex Cricketer Dean Jones dies with Heart Attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News