Home ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి సై

సమరానికి సై

  • నేడు ఆస్ట్రేలియా-కివీస్ పోరు

Smith-Williamson

బర్మింగ్‌హామ్: ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సమ రానికి సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ ప్రతి భావంతులకు కొదవలేదు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయం. వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకపై అద్భుత విజయం సాధిం చిన న్యూ జిలాండ్ ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ కు సిద్ధ మైంది. గ్రూప్-ఎలో భాగంగా జరుగు తున్న ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. ఇరు జట్ల బలబలా లు దాదాపు సమానంగా ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలి తాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు రెండు జట్లకు అందుబాటులో ఉన్నారు. వార్మప్ మ్యాచ్‌లో ఓపె నర్ మార్టిన్ గుప్టిల్ విధ్వంసక సెంచరీతో ఆకట్టు కున్నాడు. కెప్టెన్ విలియ మ్‌సన్ నీల్ బ్రూమ్, రాస్ టేలర్, ఓపెనర్ లాథమ్, లుక్ రోంచి వంటి స్టార్లతో బ్యాటింగ్ బలోపేతంగా ఉంది. అంతే గాక, ప్రపంచం స్థాయి ఆల్‌రౌండర్లు కొరె అండ ర్సన్, గ్రాండో మ్, మెక్లెనగాన్‌లు కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. మరోవైపు బోల్ట్, మిల్నే, జితేన్ పటేల్, టీమ్ సౌథి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో సిద్ధ మైంది. కాగా, ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా విజయమే లక్షంగా పోటీకి సిద్ధ మైంది. వార్నర్, స్మిత్, ఫించ్, మాక్స్‌వెల్ వంటి అద్భుత బ్యాట్స్‌మెన్‌లు జట్టుకు అందుబాటులో ఉన్నా రు. వార్నర్ భీకర ఫాంలో ఉన్నాడు. మాక్స్ వెల్, ఫించ్ కూడా దూకుడు మీదున్నారు. వీరి లో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా ఆస్ట్రేలి యాకు భారీ స్కోరు కష్టమేమి కాదు. ఇక, బౌలింగ్‌లో ఆస్ట్రే లియాకు ఎదురేలేదు. కమిన్స్, స్టార్క్, పాటిన్సన్, హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా వంటి అగ్రశ్రేణి బౌల ర్లు జట్టులో ఉన్నారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఆస్ట్రేలి యా ఫాస్ట్ బౌలర్లకు అద్భుత రికార్డు ఉంది. ఈసారి కూడా ఆస్ట్రేలి యా ఫాస్ట్ బౌలింగ్‌నే న మ్ముకుంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో బ లంగా ఉన్న ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.