Wednesday, April 24, 2024

దుమ్ము రేపిన స్టార్క్.. ఆసీస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

Australia beat West Indies Australia won by 133 runs

 

బార్బడోస్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 133 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మూడు వన్డేల సిరీస్‌లో1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి.. 252 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో తడబడ్డ విండీస్ 26.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించిన మిచెల్ స్టార్క్ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌”గా నిలిచాడు. తద్వారా ఒక వన్డేలో ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. హాజిల్‌వుడ్ 3 వికెట్లతో రాణించాడు. విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ కీరన్ పొలార్డ్(56 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా, అలెక్స్ క్యారీకి ఆసీస్ కెప్టెన్‌గా ఇది తొలి విజయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News