Home తాజా వార్తలు ఆసీస్ ఎదురీత

ఆసీస్ ఎదురీత

AUS v INDమెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన పట్టుబిగించింది. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ తో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. 399 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 54/5తో నాల్గో రోజు ఆట కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని కంగారులకు 399 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్దేశించింది. భారత ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్(42), రిషభ్ పంత్(33) రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 6, హెజిల్ వుడ్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో షాన్ మార్ష్(44), ట్రావిష్ హెడ్(34), ఉస్మాన్ ఖ్వాజా(33) పర్వాలేదనిపించారు. ప్రస్తుతం క్రీజులో టీమ్ పైన్(15), కమిన్స్(02) ఉండగా… ఆస్ట్రేలియా స్కోర్: 159/6(53 ఓవర్లు). ఇంకా ఆసీస్ విజయానికి 240 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

Australia need 239 runs to Win Melbourne Test