Friday, March 29, 2024

కాంకషన్ విధానంపై ఆస్ట్రేలియా అభ్యంతరం

- Advertisement -
- Advertisement -

Australia objected to the concussion policy

 

కాన్‌బెర్రా : విజయం సాధించడం కోసం ఆస్ట్రేలియా ఎంత వరకూ అయినా వెళుతుందనేది అందరికి తెలిసిందే. స్లెడ్జింగ్, ట్యాంపరింగ్, డ్రెస్సింగ్ రూమ్ మెసెజ్‌లు ఇలా ప్రతి వివాదం ఆస్ట్రేలియా జట్టు చుట్టూనే తిరగడం అనవాయితీగా వస్తోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి అమలు చేస్తున్న కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌పై కూడా ఆస్ట్రేలియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ఆటగాడు గాయపడిత అతని స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మరొక ఆటగాడిని తీసుకునేలా ఐసిసి కొత్త రూల్‌ను ప్రవేశ పెట్టింది. ఈ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానాన్ని మొదటిసారి వినియోగించుకున్న జట్టు కూడా ఆస్ట్రేలియానే. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో లబూషేన్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. అలా జట్టులోకి వచ్చిన లబూషేన్ శతకం కూడా సాధించి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు.

అయితే తాజాగా ఆస్ట్రేలియా ఈ రూల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వక్ర బుధ్దిని చాటుకుంది. తొలి టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ సందర్భంగా రవీంద్ర జడేజా గాయపడ్డాడు. అతను మైదానాన్ని వీడడంతో అతని స్థానంలో యజువేంద్ర చాహల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా భారత్ తీసుకుంది. దీనికి రిఫరీ కూడా అనుమతి ఇచ్చాడు. అయితే ఆస్ట్రేలియా మాత్రం చాహల్‌ను తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ జోక్యం చేసుకోవడంపై వివాదం నెలకొంది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకునే హక్కు ఏ జట్టుకైన ఉంటుంది. అయితే దీనిపై లాంగర్ అభ్యంతరం వ్యక్త చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అతని తీరును పలువురు క్రికెట్ వ్యాఖ్యతలు తప్పుపట్టారు. ఐసిసి రూల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసే అధికారం లాంగర్‌కు లేదని కామంటేటర్లు మంజ్రేకర్, అగార్కర్ తదితరులు స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News