Friday, April 19, 2024

నాసా కోసం ఆస్ట్రేలియా రోవర్!

- Advertisement -
- Advertisement -

Australia rover project

కాన్బెర్రా: అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ కోసం 20 కిలోల ‘సెమీ అటానమస్ లూనార్ రోవర్’ను నిర్మించేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ రోవర్ 2026కల్లా చంద్రుడిపై ఆక్సిజన్ పరిశోధనకు ఉపయోగపడనుంది.
ఆస్ట్రేలియా నిర్మించనున్న రోవర్ ఆక్సయిడ్స్ ఉన్న మన్నును చంద్రుడిపై నుంచి సేకరిస్తుంది. ఆ తర్వాత నాసా ప్రత్యేక పరికరం ఉపయోగించి మన్ను నుంచి ఆక్సిజన్ వేరుచేయనుంది. చంద్రుడి ఉపరితలంపై మనిషి జీవించేందుకు కావలసిన ఆక్సిజన్ తెలిస్తే అది భవిష్యత్తులో అంగారుకుడిపై ప్రయోగాలకు ఉపయోగపడతుంది.

ఆస్ట్రేలియా వాయవ్యంలోని గనుల్లో ఇనుప రజను రవాణా చేసే ట్రక్కులు 1600 కిమీ. దూరం నుంచి డంప్‌చేసేందుకు ఉపయోగిస్తున్న టెక్నాలజీని చూసి నాసా ఇంప్రెస్ అయిందని ఆస్ట్రేలియా రోదసి సంస్థ డిప్యూటీ హెడ్ ఆంథోని ముర్ఫెట్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఒప్పందం రెండు దేశాల రోదసి ప్రయోగాలను బలపరుస్తాయని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News