Wednesday, April 24, 2024

భారత్‌కు ఈజీ కాదు.. కోహ్లీకి సవాల్ విసిరిన ఇయాన్ చాపెన్

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్‌కు పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్ గుర్తు చేశాడు. అయితే అప్పట్లో సిరీస్ గెలిచిన భారత్‌కు ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అంత తేలిక కాదన్నాడు. అప్పట్లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తదితరుల సేవలు ఆస్ట్రేలియాకు అందుబాటులో లేవని, ప్రస్తుతం ఇద్దరి చేరికతో కంగారూలు చాలా బలంగా మారరన్నాడు. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు అంత సులువు కాదన్నాడు. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో పోరు హోరాహోరీగా సాగడం ఖాయమన్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశమన్నాడు. అంతేగాక లబుషేన్, పాట్ కమిన్స్, వార్నర్, స్మిత్, లియాన్, హాజిల్‌వుడ్, వేడ్, స్టార్క్ తదితరులతో కూడిన ఆస్ట్రేలియా చాలా బలంగా మారిందన్నాడు. ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు చాలా కష్టమన్నాడు. ఫాస్ట్ పిచ్‌లపై తడబడే బలహీనత ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్‌లను ఎదుర్కొవడం అనుకున్నంత తేలికకాదన్నాదు.
ఈసారి గెలిస్తేనే

ఇక గతంలో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం సాధించిన టీమిండియా ఈసారి కూడా గెలిచి చూపించాలని చాపెల్ సవాల్ విసిరాడు. అప్పుడే తాను భారత్‌ను ప్రపంచ అత్యుత్తమ జట్టుగా పరిగణిస్తానని తెలిపాడు. విరాట్ కోహ్లి, పుజారా, రహానె, అశ్విన్, బుమ్రా, షమి, ఇషాంత్, మయాంక్ తదితరులతో భారత్ బలంగానే ఉన్నా ఆస్ట్రేలియాను ఓడించడం వారికి సాధ్యం కాదన్నాడు. గతంతో పోల్చితే ప్రస్తుతం ఆస్ట్రేలియా చాలా బలంగా తయారైందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉందన్నాడు. ఇక, భారత్‌కు నిలకడలేమి ప్రధాన ఇబ్బందిగా తయారైందన్నాడు. దీనికి న్యూజిలాండ్ గడ్డపై ఎదురైన పరాజయమే దీనికి నిదర్శనమన్నాడు. ఇక, టీమిండియాను తక్కువ చేసి చూడడం తన ఉద్దేశం కాదన్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లికి సవాళ్లను ఎదుర్కొవడం చాలా ఇష్టమని, అందుకే అతనికి ఈ ఛాలెంజ్‌ను విసురుతున్నానని చాపెల్ స్పష్టం చేశాడు.

Australia Series is not easy to India: Ian Chappell

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News