Friday, April 19, 2024

ఆసీస్ లక్ష్యం 119

- Advertisement -
- Advertisement -

Australia target is 119 runs

దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా- ఆస్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 119 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఉంచింది. ఎయిడెన్ మర్క్రమ్ ఒక్క 40 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరు 20 పరుగులు మించి చేయలేదు. బావుమా 12 పరుగులు చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రస్సీ వెండర్ డస్సెన్ రెండు పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో వాడేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. క్వింటన్ డికాక్ 7 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. హెన్రీచ్ క్లాసెన్ 13 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మర్క్రమ్ 40 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డెవిడ్ మిల్లర్ 16 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. కగిసో రబడా 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హజిల్‌వుడ్, అడమ్ జంపా తలో రెండు వికెట్లు తీయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్నీస్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News