Friday, April 19, 2024

కంగారులదే ప్రపంచకప్

- Advertisement -
- Advertisement -

Australia victory over Kiwis in T20 World Cup final

టి 20 ప్రపంచ కప్ ఫైనల్లో కివీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
తొలిసారి పొట్టి వరల్డ్ కప్ విజేతగా అవతరించిన ఫించ్ సేన

మార్ష్, వార్నర్ మెరుపులు
హాజిల్‌వుడ్ మాయ
ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు
ఆసీస్ ఖాతాలో తొలి
టి20 ప్రపంచకప్

దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి తన ఖాతాలో తొలి టి20 ప్రపంచకప్ ట్రోఫీని జత చేసుకుంది. మరోవైపు న్యూజిలాండ్ వరుసగా మూడు సార్లు ప్రపంచకప్‌లో రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. డేవిడ్ వార్మన్, మిఛెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

వార్నర్, మార్ష్ జోరు..

భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ అరోన్ ఫించ్ ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చి న మిఛెల్ మార్ష్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. వార్నర్ ఈ మ్యాచ్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వర్షం కురిపించాడు. కివీస్ బౌలర్లను హడలెత్తించిన వార్నర్ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. మార్ష్ కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరి విజృంభణతో ఆస్ట్రేలియా పటిష్టస్థితికి చేరుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 38 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించి ఆస్ట్రేలియాకు విజయాన్ని ఖాయం చేశారు. వార్నర్ ఔటైనా మార్ష్ తన జోరును కొనసాగించాడు. అతనికి మాక్స్‌వెల్ అండగా నిలిచాడు. విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన మార్ష్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 77 పరుగుఉల చేసి అజేయంగా నిలిచాడు. ఇక మాక్స్‌వెల్ 4 ఫోర్లు, సిక్స్‌తో 28 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా మరో ఏడు బంతులు మిగిలివుండగానే మ్యాచ్ ను సొతం చేసుకుంది.

విలియమ్సన్ మెరుపులు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డారిల్ మిఛెల్, మార్టిన్ గుప్టిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గుప్టిల్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు డారిల్ మిఛెల్ ఒక సిక్స్‌తో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 28 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తనపై వేసుకున్నాడు. అతనికి మరో ఓపెనర్ గుప్టిల్ అండగా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కివీస్ ఆశించిన స్థాయిలో వేగంగా పరుగులు చేయలేక పోయింది. అయితే విలియమ్సన్ మాత్రం చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. ఇక గుప్టిల్ సమన్వయంతో ఆడాడు. అతని బ్యాటింగ్‌లో బ్యాటింగ్ కనబడలేదు. చాలా సేపటి వరకు క్రీజులో ఉన్నా వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. కానీ విలియమ్సన్ మాత్రం వీలు దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ స్కోరు ను పరిగెత్తించాడు.

ఇక రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరిచిన గుప్టిల్ మూడు ఫోర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ఔటైనా విలియమ్సన్ తన జోరును కొనసాగించాడు. అతనికి గ్లెన్ ఫిలిప్స్ అండగా నిలిచాడు. ఫిలిప్స్‌తో కలిసి విలియమ్సన్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశా డు. ఈ ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమైన విలియమ్సన్ కీలకమైన ఫైనల్లో మాత్రం సత్తా చాటాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగుల వర్షం కురిపించాడు. మరోవైపు ఫిలిప్స్ ఒక ఫోర్, సిక్స్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యా డు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 48 బంతుల్లోనే పది ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 85 పరుగులు చేసి ఔటయ్యా డు. ఈ రెండు వికెట్లు హాజిల్‌వుడ్ ఖాతాలోకే వెళ్లాయి. నీషమ్(13), సిఫర్ట్ (8) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో కివీస్ స్కోరు 20 ఓవర్లలో 4 వికె ట్ల నష్టానికి 172 పరుగులకు చేరింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 4 ఓవర్లలో 16 పరుగు లు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆడమ్ జంపా, కమిన్స్ కూడా పొదుపు గా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News