Friday, March 29, 2024

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్

- Advertisement -
- Advertisement -

Australian women's team won first ODI against New Zealand

 

మౌంట్ మాంగనూయి: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఆదివారం న్యూజిలాండ్ మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వరుసగా 22వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఉన్న 21 వరుస విజయాల రికార్డును అదే దేశానికి చెందిన మహిళా టీమ్ చెరిపేసింది. రికీ పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు వరుసగా 21 విజయాలు సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇక గతంలోనే ఈ రికార్డును సమం చేసి ఆస్ట్రేలియా జట్టు తాజాగా కొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లారెన్ డౌన్ ఒంటరి పోరాటం చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డౌన్ 8 ఫోర్లతో 90 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవ్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలిస్సా హేలీ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసింది. ఎలిసె పెర్రి ఏడు ఫోర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు ధాటిగా ఆడిన ఆష్లే గార్డ్‌నర్ 41 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 3 ఫోర్లతో అజేయంగా 53 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా వరుసగా 22వ విజయాన్ని అందుకుంది. ఇక ఆస్ట్రేలియా మహిళా జట్టు 2018 మార్చి 12 నుంచి ఇప్పటి వరకు వన్డేల్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇదే క్రమంలో అన్ని సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ చేస్తూ వస్తోంది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మహిళా జట్టు అజేయంగా కొనసాగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News