Thursday, April 18, 2024

ఆస్ట్రేలియా ఆశలు సజీవం

- Advertisement -
- Advertisement -

Australia's semi-final chances alive in T20 World Cup

దుబాయి: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు 73 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు 6.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడు ఫోర్లతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. బంగ్లాదేశ్ బౌలర్లను హడలెత్తిచిన కెప్టెన్ ఫించ్ 20 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మిఛెల్ మార్ష్ రెండు ఫోర్లు, సిక్స్ అజేయంగా 16 పరుగులు చేశాడు.

జంపా మాయ..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు 73 పరుగులకే పరిమితం చేశారు. కంగారూ బౌలర్లు ఆరంభం నుంచే వరుస క్రమంలో వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు నయీం (17), లిటన్ దాస్ (0) శుభారంభం అందించలేక పోయారు. సౌమ్యసర్కార్ (5), రహీం (1), అఫిఫ్ (0), మెహదీ హసన్ (0) నిరాశ పరిచారు. షమీమ్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, హాజిల్‌వుల్‌లు చెరో రెండు వికెట్లను తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News