Thursday, April 25, 2024

నమ్మకంగా ఉంటూ దోచుకున్నాడు

- Advertisement -
- Advertisement -

Auto Driver Arrested for Burglary in Balapur

ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, బైక్ చోరీ
ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసిన మీర్‌పేట పోలీసులు

హైదరాబాద్: వృద్ధ దంపతులకు చేదోడువాదోడుగా ఉంటూ వారి ఇంటికే కన్నమేసిన ఆటోడ్రైవర్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 13.40తులాల బంగారు ఆభరణాలు, రూ.1,25,000 నగదు, మూడు ఎటిఎం కార్డులు,బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం, బోవెన్‌పల్లికి చెందిన సారా నాగాయ్య రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, మీర్‌పేట, గాంధీనగర్‌లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న వృద్ధ దంపుతులు గత ఐదేళ్ల నుంచి నిందితుడి ఆటోలో షాపింగ్, ఎటిఎంలలో డబ్బులు తీసుకునేందుకు ఆటోలో తీసుకుని వెళ్లేవాడు. వృద్ధాప్యం మీద పడడంతో అన్ని మర్చిపోయేవాడు. దీంతో నిందితుడు వారి బ్యాంక్ ఖాతాల నంబర్లు, ఎటిఎం పిన్ నంబర్లు తెలుసు. నిందితుడికి ఆర్థిక పరిస్థితులు ఎదురుకావడంతో వృద్ధుల ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు.

ఈ నెల 15వ తేదీ ఉదయం 10గంటలకు కుక్కర్ కొనుగోలు చేసేందుకు ఆటోలో వెళ్లారు. షాపింగ్ సెంటర్ వద్ద వృద్ధుడు ఆటోలో ఇంటి తాళం చెవి మర్చిపోయి కిందికి దిగి షాపింగ్ చేస్తున్నాడు. ఇది గమనించి నిందితుడు తాళం చెవిని తీసుకుని ఆటోను అక్కడే వదిలేసి స్నేహితుడి స్ప్లెండర్ బైక్‌పై వెళ్లి ఇంటి తా ళం తీసి అల్మారాను పగుల గొట్టి బంగారు ఆభరణాలు, బైక్‌ను చోరీ చేశారు. నింది తుడు మొత్తం రూ.35,95,000 విలువైన వస్తువులు చోరీ చేశారు. బాధితుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు సిసిటివిల సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్సై మారయ్య, పిసిలు కరన్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News