Home తాజా వార్తలు హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ హత్య

హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ హత్య

Murderహైదరాబాద్‌: మియాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌(24)ను  దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. మియాపూర్‌ ధర్మపురిక్షేత్రం వద్ద ఈ ఘటన జరిగింది.   మొండెం నుంచి తలను వేరుచేసి బొల్లారం చౌరస్తాలో పడేశారు. ప్రవీణ్ మొండెం, తలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto Driver Murder In Miyapur At Hyderabad