Home తాజా వార్తలు ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులు అరెస్టు

ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులు అరెస్టు

Auto Driver Murder

 

హైదరాబాద్: పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో రియాసత్ అలీ అనే ఆటోడ్రైవర్ ను  ఆదివారం ఉదయం దారుణంగా హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ… పంజాగుట్టలో ఆటో డ్రైవర్ రియాసత్ హత్య కేసును ఛేదించినట్టు ఆయన తెలిపారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు చాంద్రాయగుట్టలో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు అని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు సిపి వెల్లడించారు. నిందితుల నుంచి 5 కత్తులు, ఒక మారుతీవ్యాన్, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రియాసత్ అలీ హత్యకు పాతకక్షలే కారణామని, మృతుడు గతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని సిపి పేర్కొన్నారు.

Auto Driver Murder in Panjagutta at Hyderabad