Home తాజా వార్తలు హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ హత్య

హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ హత్య

Murderహైదరాబాద్ : పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో ఆటోడ్రైవర్ అహ్మద్‌ ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల కారణంగా యాకత్ అలీ అనే యువకుడు ఆటో డ్రైవర్ అహ్మద్ ను దారుణంగా చంపేశాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం అహ్మద్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు యాకత్ అలీ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Auto Driver Murder In Panjagutta At Hyderabad