Home జాతీయ వార్తలు రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి ఆటో.. జరిమానా విధించని కోర్టు

రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి ఆటో.. జరిమానా విధించని కోర్టు

Railway Platform

 

న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆటో డ్రైవర్ సకాలంలో దవాఖానకు చేర్చి తల్లి బిడ్డ కాపాడిన సంఘటన ముంబైలోని విరార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వేళ్లితే… ఆగస్టు 4వ తేదీన ఉదయం ఓ రైలును కుండపోత వర్షం కారణంగా ముంబైలోని విరార్ స్టేషన్ లో ఆపారు. అయితే ఆ రైలు లో ఏడు నెలల గర్భిణి, ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో ఆమెకు పురిటినొప్పులు రావాడంతో భర్త ఆటో స్టాండ్ వద్దకు వెళ్ళి తన భార్యకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.. అర్జంట్ గా ఆసుపత్రికి తీసుకెళ్లాన్ని ఆటో డ్రైవర్‌ను బాతిమిలడ్డాడు.

దీంతో ఆటో డ్రైవర్‌ ఏమి ఆలోచించాకుండా ఆటోను రైల్వే ప్లాట్ ఫాంపైకి పోనిచ్చి.. గర్భిణిని స్టేషన్ దగ్గర్లోన్ని సంజీవని దవాఖానకు తీసుకెళ్లాడు. గర్భిణి నెలలు నిండని శిశువుకు జన్మనిచ్చింది. రైల్వే పోలీసులు ఆటో డ్రైవర్ సాగర్ కమలాకర్ గవాడ్(34)ను నిబంధనలు ఉల్లంఘించి.. ఆటోను ప్లాట్‌ఫాంపైకి తీసుకెళ్లాడని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆటో డ్రైవర్ సాగర్ బెయిల్‌పై విడుదలయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఓ మంచి పని చేశాడని రైల్వే పోలీసులు అతడిని అభినందించారు.

Auto driver took Auto on Railway Platform To Help Woman