Friday, April 19, 2024

ఆటోవాలా.. పైసా వసూల్

- Advertisement -
- Advertisement -

Auto drivers

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసి తర్వాత ప్రజాప్రైవేట్ రవాణాలో ఆటోలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయి తే ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటోలకు, క్యాబ్‌లు నగరంలో తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆయా వాహనా లు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ముఖ్యంగా మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఆటోల్లో ఇద్దరు, క్యాబ్‌లో ముగ్గు రు మాత్రమే ప్రయాణించేలా నిబంధన విధించింది.

అయితే ఆటో డ్రైవర్లు ఆ నిబంధలను పక్కన పెట్టడమే కాకుండా ప్రయాణికులు వద్ద నుంచి ఇష్టం వచ్చిన విధంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి కిలో మీటర్ దూరానికి రూ. 50 నుంచి 80వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెబుతున్నారు. ఒక వైపు నగరంలో ఆర్‌టిసి, మెట్రో, ఎంఎటిఎస్‌లు తిరిగేందుకు అనుమతిలేక పోవడంతో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

జిల్లాకు వెళ్ళే బస్సులకు ప్రభుత్వ అనుమతి శివారు ప్రాంతాలకు నుంచి అనుమతి ఇవ్వడంతో తాము స్వస్థలాలకు వెళ్ళేందుకు ఎందో ఇబ్బంది పడుతున్నామని, ఒక వైపు ఆర్‌టిసి 50 శాతం చార్జీలను అదనం గా వసూలు చేయడం, మరో వైపు ఆటోలు నిలువు దోపిడితో చార్జీలు విమాన నాప్రయాణ చార్జీలను మించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారని ఆటోలకు తిరిగేందుకు వారి కుటుంబాలు సై తం రోడ్డున పడ్డాయి అన్ని తెలిసి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అధికంగా చార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మీటర్లు వేయడం ఎప్పుడో మరిచారు….

నిబంధనల ప్రకారం మొదటి 1.6 కిలో మీటర్‌కు రూ.20లను అనంతరం ప్రతి కిలో మీటర్‌కు రూ.11కును ఆటోచార్జీ వసూలు చేయాలి. కాని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆటోడ్రైవ ర్లు మీటర్లను వేయడం పూర్తిగా మరచిపోయారు. దీంతో ఆటోలు మీ టర్లు ఉన్నా లేనట్లుగా ఉంది పరిస్థితి. ఇంత జరుగుతున్నా సంబంధి త అధికారులు ఆయా ఆటోలుపై ఎటువంటి చర్యలు తీసకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

 నోరు మెదపని ఆటోయూనియన్ లీడర్లు..

ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామంటూ మంత్రులు, అధికారులను కలిసి సమస్యలపై వినిత పత్రాలు సమర్పించే అదనపు దోపిడిపై స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. యూనియన్ లీడర్లు కేవలం వారి సమస్యలపై మాత్రమే స్పందిస్తారా? ప్రయాణికులు ఏమైపోయినా పర్వాలేదాని ? ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Auto drivers are charging higher fares to passengers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News