Home తాజా వార్తలు ఆటో డ్రైవర్ ప్రాణం తీసిన అగ్గిపుల్ల

ఆటో డ్రైవర్ ప్రాణం తీసిన అగ్గిపుల్ల

 

చెన్నై: అగ్గిపుల్ల అంటుకొని అటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆటో డ్రైవర్ అగ్గిపుల్లతో సిగరెట్‌ను వెలుగించుకొని ధూమపానం చేస్తున్నాడు. అదే సమయంలో రెండో చేత్తో టీ కూడా తాగుతున్నాడు. అగ్గిపుల్ల అనుకోకుండా అతడి ధోతిపై పడింది. ధోతి పాలిస్టర్ కావడంతో మంటలను వెంటనే అంటుకున్నాయి. దీంతో డ్రైవర్ ఆటో నుంచి బయటకు దూకి కాపాడాలి… కాపాడాలి అని అరిచాడు. దీంతో టీ షాప్ వద్ద ఉన్న నీళ్లను అతడిపై చల్లారు. వెంటనే ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఆటోకు మంటలు అంటుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Autorickshaw Driver Died with Lighting a Cigarette