Friday, March 29, 2024

అవతార్-2 వసూళ్ల సునామీ

- Advertisement -
- Advertisement -

తొలి వారంలోనే రూ. 200 కోట్ల వసూలు…

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్‌‌ 2’ శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు అద్భుత స్పందన లభిస్తోంది. 13 ఏళ్ల కిందట వచ్చిన మొదటి భాగంలో ‘పండోరా’ అందాలను చూపించి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామరూన్‌ ఇప్పుడు దానికి కొనసాగింపుగా  ‘ద వే ఆఫ్‌ వాటర్‌‌’లో నీటి అడుగున అందాలు, భారీ సముద్ర జీవులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. నాలుగు వేలకు పైగా తెరల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ చిత్రం.

దాంతో భారత్ లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్‌’ (రూ.53.10 కోట్లు)ను అవతార్-2 అధిగమించలేకపోయింది. మొదటి రోజు దేశ వ్యాప్తంగా రూ.41 కోట్లు రాబట్టింది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే, రెండో రోజు వసూళ్లు పెరిగాయి. రెండో రోజు 45–46 కోట్ల రూపాయలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో, రెండు రోజుల్లోనే భారత్ లో అవతార్2 వసూళ్లు రూ. 100 కోట్ల మార్కు దగ్గరకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో  రూ. 1500 కోట్లు వచ్చాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అవతార్-2 తొలి వారంలో రూ. 130 కోట్లు రాబడుతుందని అంచనా వేశారు. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే తొలి వారంలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కు చేరుకుంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News