Thursday, April 25, 2024

ఆరోగ్య కార్యకర్తల తర్వాత వైమానిక సిబ్బందికి టీకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో ఆరోగ్య కార్యకర్తల తర్వాత ముందు వరుస యోధులుగా వైమానిక సిబ్బందిని పరిగణించాలని కేంద్ర ఆరోగ్యశాఖను విమానయాన మంత్రిత్వశాఖ కోరింది. డిసెంబర్ 28న ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మొదట మూడు కోట్లమంది ఆరోగ్య కార్యకర్తలు, ముందు వరుస యోధులకు టీకాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన 27 కోట్లమందికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నది.

అయితే, ముందు వరుస యోధుల జాబితాలో సైనికులు, జైళ్ల సిబ్బంది, మున్సిపల్ కార్మికుల గురించి ప్రస్తావించిన ఆరోగ్యశాఖ వైమానిక సిబ్బందిని విస్మరించడం పట్ల ఆ శాఖ స్పందించింది. ఈ నెల 20న విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోలా నుంచి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌కు ఓ లేఖ పంపారు. అందులో తమ సిబ్బందితోపాటు ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యాక్సిన్లను దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు చేరవేయడంలోనూ తమ సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు.

Aviation Ministry urges to Health Ministry for vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News