Friday, March 29, 2024

అవినాష్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి: సిబిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. శుక్రవారం అవినాష్ రెడ్డి, సునీత వాదనలను హైకోర్టు వినింది. ఇవాళ సిబిఐ వాదనలను హైకోర్టు విననుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ ఇప్పటికే కౌంటర్ వేసింది.

అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సిబిఐ ఆరోపిస్తోంది. అవినాష్ ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిఉందని సిబిఐ తెలిపింది. వివేకా హత్యకు కుట్రలో ఇంకా ఎవరి ప్రయేమమైనా ఉందేయో దర్యాప్తు చేయాలని సిబిఐ కోర్టును కోరింది. జగన్ కు అవినాష్ రెడ్డి చెప్పారా అనే విషయంలో దర్యాప్తు చేయాల్సిఉందని సిబిఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ముగిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News