Home రాష్ట్ర వార్తలు మైనింగ్ జోన్‌ను విరమించుకోవాలి

మైనింగ్ జోన్‌ను విరమించుకోవాలి

Thammineni-Veerabhadramమన తెలంగాణ/హైదరాబాద్: మైనింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ప్రభుత్వం ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటుతో ఆరుట్ల, చెన్నారెడ్డి గూడ, బోడకుంట, బండలేమూరు గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల బతుకుదెరువు లేకుండాపోతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ జోన్ ఏర్పాటు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.