Tuesday, April 23, 2024

సోషల్ మీడియా, సైబర్ నేరాలపై అవగాహన తరగతులు

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా ఎస్పి సిహెచ్. ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, ఆదేశాల మేరకు రవి కుమార్ ఆర్.ఎస్.ఐ నిర్మల్ దీక్ష డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఎలా జాగ్రత్తలు వహిస్తూ వాడాలి, ఎన్ని రకాల సైబర్ నేరాలు ప్రస్తుతం జరుగుతున్నాయి వాటి గురించి కొన్ని కేసులను వివరిస్తూ కూలంకషంగా చెప్పటం జరిగింది. నేరాలు జరిగినప్పుడు, సైబర్ నేరాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన నిర్వహించారు. సైబర్ నేరాలు ఆన్లైన్ లో మోసాలు జరిగినప్పుడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తక్కువ ధరలో వస్తువులు, వాహనాలు అమ్మబడును అని, మీ బ్యాంకు ఖాతా పిఎఎన్ నంబర్ ని అప్డేట్ చేసుకోమని వస్తే, మీరు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని ఇలా అనేక రకాలుగా ప్రస్తుతం మోసాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా యువకులు డేటింగ్ యాప్ ల ద్వారా ఎలా మోసుతున్నారో వివరించారు. ఇలా జరిగినప్పుడు అనుకోకుండా ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే సైబర్ నేరస్తుల ఖాతాకు వెళ్ళే లావాదేవీలను నిలిపివేసి మన సొమ్ము మనకు అందించే అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ 1930 నంబర్ లను గుర్తు పెట్టుకోవాలని అలాగే చుట్టు పక్కల వారికి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలి అని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కు కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News