*ఐక్యత, సహకారం, సేవాతాత్పర్యాన్ని అందరూ కలిగి ఉండాలి
*మున్నూరు కాపుల సంక్షేమం కోసం సీంఎతో చర్చిస్తా..
*10 ఎకరాల స్థలం, రూ. పది కోట్ల నిధుల మంజూరుకి కృషి చేస్తా..
*జిల్లాలో జరిగిన మున్నురు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు వెల్లడి
మన తెలంగాణ/సూర్యాపేట: సమాజంలో రోజురోజుకు జరుగు తు న్న మార్పులను మున్నూరు కాపులు అవగాహన చేసుకోవాలని శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు వెల్లడిం చారు. సమాజాన్ని కాపుగాసే కులస్తులంతా ఏకతాటిపై నడవా లని సూ చించారు. పరస్పర సహకారంతో ఉన్నత స్థానిక ఎదగ డానికి అండగా నిలిచేందుకు మున్నూరుకాపు డైరెక్టరీ లక్షమని అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లాలోని చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ సమీపంలో రూ. 50 లక్షల వ్యయంతో నూ తనంగా నిర్మిం చిన మున్నూరు కాపు ట్రస్ట్ భవనాన్ని పరిశీ లించి అనంతరం ఏర్పాటు చేసిన మున్నూ రు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ప్రసం గించారు. నేటి సమాజంలో కులం అనేది ఒక చారిత్రాత్మకమైనదని వారి కులాల అభివృద్ధి కోసం అందరూ పోరాటం చేయడం సహజమని చెప్పారు. ఊరి ని కాపుగాసే మున్నూ రు కాపులు లేని ఊరు గానీ, పట్టణంగానీ తెలంగాణలో లేదని వివరించారు. వీరి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంతో ప్రతి ఒక్కరి కడుపు నింపుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపుల కుల అభివృద్ధి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందకు వెళ్తుందని వివరించారు. సంఘం తరపున చేపట్టే ప్రతి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపుల ఐక్యత, అభివృద్ధి కోసం పరస్పర సహకారం కోసం, సమాచార ప్రచారం కోసం, సేవా తాత్పర్యాన్ని చాటేందుకు కష్టసుఖాలలో తోడు నీడగా కాపులంతా దోహదపడాలని సూచించారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి మున్నూరు కాపుల అభివృద్ధికి మరో పది ఎకరాల స్థలాన్ని, రూ. పది కోట్ల నిధులను మంజూరు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాదాద్రిలో రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న మున్నూరు కాపు భవనం పూర్తి అవుతున్నందున సీఎం కేసీఆర్‌తో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు సమీపంలో ట్రస్ట్ భవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద మున్నూరు కాపులు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర అధ్యక్షులు కాశెట్టి ఆనంద్‌కుమార్, జిల్లా కన్వీనర్ ఉప్పు శ్రీనివాసరావు, సంఘ సభ్యులు పెద్దిరెడ్డి రాజా, నల్లకుంట్ల అయోధ్య, కౌన్సిలర్ నిమ్మల వెంకన్న, లక్కరాజు పాండురంగరాజు, సూర్యప్రకాశ్, ఎలిమినేటి రమేష్, బండి అశోక్, వీరూనాయుడు, గాలి వెంకటయ్య, మిర్యాల కృష్ణమూర్తి, దాచెపల్లి సుజాత, సుశీల, చింతలపాటి శ్రీనివాస్,టి.సీతయ్య, వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.