Home జగిత్యాల రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

District collector Sharath

 

మానవ తప్పిదాల వల్లే అధిక ప్రమాదాలు
హెల్మెట్ వాడకం ద్వారా ప్రాణాలకు రక్షణ
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్వాడకంపై అవగాహన సదస్సు

మన తెలంగాణ/జగిత్యాల: నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో ముందుందని అదే స్ఫూర్తితో రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ భద్రత వారోత్సవాల కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. ఎస్‌పి సింధూశర్మ అధ్యక్షతన స్థానిక వివేకానంద మినీ స్టేడియంలో హెల్మె ట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్నిని ర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్ట ర్ శరత్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, జగిత్యాల, కో రుట్ల, చొప్పదండి, ధర్మపురి ఎంఎల్‌ఏలు డా క్టర్ సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, సు ంకె రవిశంకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ మావన తప్పిదాల వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రా ఫిక్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్షం త దితర కారణాలతో వందలాది మంది ప్రాణా లు కోల్పోతున్నారన్నారు.

యువకులు హైస్పీ డ్ మోటర్ సైకిల్స్ వాడుతూ రోడ్డు నియమా లు పాటించకపోవడంతో ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వా హనాలు నడిపేటప్పుడు తమ కుటుంబ స భ్యులు ఆధారపడి ఉన్నారనే స్పృహ కలిగి ఉన్నట్లయితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. జిల్లాలోని ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యోగి హెల్మెట్ వా డేలా ఆదేశాలు జారీ చేస్తామని, ఎవరైనా రో డ్డు నియమాలు పాటించనట్లయితే శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామన్నా రు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో హెల్మెట్ ధరించి వచ్చిన వారికి ముందు ప్రా ధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజే శం గౌడ్ మాట్లాడుతూ సగటున లక్ష57వేల మంది ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని,సరైన నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇటీవల కొండగట్టు ఘాట్ రో డ్డులో బస్సు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి, సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రా ణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మపురి ఎంఎల్‌ఏ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారణకు పగడ్బ ందీ చర్యలు చేపట్టాలన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్న వారు ఎక్కు వ మంది యువకులు విద్యార్థులేనని, వారి మృతి తల్లిదండ్రులకే కాకుండా సమాజానికి కూడా తీరని నష్టం అన్నారు. పతి ఒక్కరూ సామాజిక బా ధ్యతగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్య లు చేపట్టాలని కోరారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూ పాలని, లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లు ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. ఎం ఎల్‌ఏ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ రోడ్ల పై రద్దీ పెరగడం, రోడ్డు ప్రమాదాలకు కారణమని, 16 నుంచి 35 సంవత్సరాల వయ స్సు వారే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు.

రోడ్డు ప్రమాద మృతులు అధిక ంగా తలకు తీవ్ర గాయాలై మృతి చెందుతున్నారని, హెల్మెట్ వాడినట్లయితే రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. జిల్లా ఎస్‌పి సింధూశ ర్మ మాట్లాడుతూ గత సంవత్సరం దేశంలో ఒక లక్ష30వేల మంది రోడ్డు ప్రమాదాల కా రణంగా మృతి చెందగా జగిత్యాల జిల్లాలో గత సంవత్సరం 216 మంది ప్రాణాలు కో ల్పోగా మరో 600 మంది తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. వాహన చోదకులకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు వీధిన పడుతాయన్నారు. జగిత్యాలను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం హెల్మెట్స్ ధరించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ చంద్రశేఖర్‌రావు, అడిషనల్ ఎస్‌పి మురళీధర్, ఆర్‌డిఓ నరేందర్, డిఎస్‌పి వెంకటరమణ, డిటిఓ కిషన్‌రావు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Awareness program on Using helmets in Mini Stadium