Wednesday, April 24, 2024

యువతకు దేశాభివృద్దిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: యువతలో ఉన్న శక్తి యుక్తులను వెలికి తీసి వారిని సంఘటిత పరిచి వారిని దేశాభివృద్దిలో భాగస్వాములను చేయుటకు యువతకు అనుకూలమైన సమయంలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించితే వారు ఎక్కువగా పాల్గొంటారని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జరిగిన నెహ్రూ యువ కేంద్రం హైదరాబాద్ జిల్లా యూత్ ప్రొగ్రాం సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువకులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించి వీరు సంఘం కార్యకలపాలను సమర్దవంతంగా నిర్వహించేటట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇతర ప్రభుత్వేతర సంస్దలు చేపడుతున్న కార్యక్రమాల గురించి యువతకు అవగాహన కలగజేయాలని తెలిపారు. యువకులు చేసే కార్యక్రమాలపై సరైన ప్రచారం కల్పిస్తే వీరిని చూసి మరికొందరు ఈకార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ అదికారి సురేందర్, జిల్లా యువజనాధికారి కుష్బూగుప్తా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News