Friday, April 19, 2024

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు

- Advertisement -
- Advertisement -

Awareness seminars on mosquitoes in Hyderabad

దోమల నియంత్రణ మన చేతుల్లోనే:  జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ సంతోష్

హైదరాబాద్: దోమలు పిల్లలు పెట్టకుండా, అవి కుట్టకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ బి.సంతోష్ అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం బేగంపేట్ సర్కిల్‌లోని వెంగల్‌రావు నగర్‌లో ఏర్పాటు చేసిన దోమల నివారణ సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ దోమల కారణంగానే మలేరియా సోకుతుందని 1897 అగస్టు 20వ తేదీన బేగంపేటలోని ప్రయోగశాలలో గుర్తించిన ప్రపంచానికి చాటింది డాక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. తన విశిష్ట పరిశోధనలో మానవళికి ఎంతో మేలు చేసే విషయాన్ని కనుగోన్న సర్ రోనాల్డ్ రాస్‌ను నోబుల్ ప్రైస్‌తో సత్కరించారని, ఈ ఘనత పొందిన మొదటి భారతీయుడు ఆయనేనని పేర్కొన్నారు.

ఈ తర్వాత మలేరియా క్రిమిని గుర్తించిన ఆగస్టు 20వ తేదీని ప్రపంచ దోమల దినోత్సవంగా గుర్తించి నిర్వహించడం జరగుతుందని తెలిపారు. ప్రాణాంతక విష జర్వాలు, వ్యాధులకు కారణమైన దోమల నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉందన్నారు. దోమలు రాకుండా ఇళ్ల ద్వారాలు, కిటికీలకు జాలీలను అమరుర్చుకోవడంతోపాటుదోమ తెరలు వాడం, వారానికి ఒక్కసారి ఇళ్లలోనిఅనవసరపు నీటి నిల్వలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా దోమలు వృద్ది చెందకుండా పలు జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News