Tuesday, April 23, 2024

నీట్ కటాఫ్ మార్కులను 10 శాతం తగ్గించిన ఆయూష్ డిపార్ట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

AYUSH Department reduces NEET cut off marks by 10%

 

మన తెలంగాణ/హైదరాబాద్ : యూజీ 2020-21 ఆయూష్ వైద్య, విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కులను 10 శాతం తగ్గించాలని కేంద్ర ఆయూష్ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయూష్ సీట్ల ధరఖాస్తుకు ఈనెల 20 వరకు తుది గడువు విధిస్తూ యూనివర్సిటీ ఇప్పటికే నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్ధులు సైతం ఈనెల 20వ తేది రాత్రి 8 గంటల వరకు ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉందని వర్సిటీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కొరకు అభ్యర్ధులంతా www.knruhs.telangana.gov.inను చూడాలని కాళోజీ యూనివర్సిటీ వర్గాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News